ఈ నెల18న ఇంటర్ రిజల్ట్స్

ఈ నెల18న ఇంటర్ రిజల్ట్స్

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అవనున్నాయి. ఈ నెల 18న విడుదల కానున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. పరీక్షరాసి నెల రోజులవడంతో విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వారి తల్లిదండ్రులలో కూడా టెన్షన్ మొదలైంది. ఎట్టకేలకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ను విడుదల చేయడానికి విద్యాశాఖ ముందుకు వచ్చింది. నాంపల్లి విద్యాభవన్ లో గురువారం ఫలితాలను అధికారు విడుదల చేయనున్నారు. రిజల్ట్స్ కోసం www.results.cgg.gov.in వెబ్ సైట్ ను చూడవచ్చు.