ఏప్రిల్ 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఏప్రిల్ 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన చేసింది.  ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.  ఎన్నికల కోడ్ నేపథ్యంలో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.  ప్రథమ, ద్వితీయ ఏడాది పరీక్ష ఫలితాలను ఇంటర్‌ బోర్డు ఒకేసారి వెల్లడించనుంది. మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.  ఇంటర్ విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/home.do లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. వీటికి 9.80 లక్షల మంది అంటెండ్ అయ్యారు. కాగా, ఏపీలో మార్చి 1 నుంచి 20 వరకు  ఇంటర్ పరీక్షలు జరగ్గా, ఈ నెల 12న ఫలితాలు ఇచ్చారు. దీంతో తెలంగాణ అధికారులపై ఒత్తిడి పెరిగింది.  ఇక పదోద తరగతి ఫలితాల విడుదలపై కూడా విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది.  ఏప్రిల్  30 లేదా మే 1న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ యోచిస్తోంది.  కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగాయి. 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.