తెలంగాణ అద్భుతమైన రాష్ట్రం : మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

తెలంగాణ అద్భుతమైన రాష్ట్రం : మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: పట్టణాల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అద్భుతమైన రాష్ట్రంగా ముందుకు సాగుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన జల మండలి ఓఎస్డీ పీఆర్వో కన్నోజు మనోహరాచారి రచించిన ‘తెలంగాణ అభ్యుదయం.. దేశానికి మహోదయం’అనే పుస్తకాన్ని ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆవిష్కరించారు. రాష్ట్ర ఐటీ సెక్టార్ దేశానికే రోల్ మోడల్ అని పేర్కొన్నాఉ. 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం, పశు పోషణ, సాగు నీరు, విద్య, వైద్యం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ఐటీ సహా అన్ని రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. ఈ ఎనిమిదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ఈ పుస్తకంలో వివరించారని చెప్పారు. పుస్తకాన్ని రాసిన కన్నోజు మనోహరాచారిని కేటీఆర్, జల మండలి ఎండీ దాన కిషోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు​అభినందించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీ శంకర్ పాల్గొన్నారు.