ఓ కుటుంబం గుప్పిట్లోనే తెలంగాణ నలిగిపోతోంది: లక్ష్మణ్

ఓ కుటుంబం గుప్పిట్లోనే తెలంగాణ నలిగిపోతోంది: లక్ష్మణ్

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగానే ఇంటర్ విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఇంటర్ రిజల్ట్ ను వారి పెంపుడు కుక్కలకు కాంట్రాక్టుగా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని బీసీ సాధికారత భవన్ విశ్వబ్రాహ్మణ మనుమయా సంఘం ఆధ్వర్యంలో జగద్గురు అదిశంకరాచార్యుల జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణ్.. రాజకీయాలను డబ్బు శాషిస్తోందని.. డబ్బును అక్రమంగా సంపాదించిన వ్యాపార, పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసే వారిని ప్రజలు ఆదరిస్తున్నప్పటికి…చివరి నిమిషంలో డబ్బు ప్రధాన పాత్ర పోషించడంతో ఓడిపోతున్నారన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం..ఓ కుటుంబం గుప్పిట్లో నలిగిపోతుందని విమర్శించారు. యువకుల బలిదానాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో… మళ్లీ విద్యార్థులే బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మణ్.