తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత దంపతులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత దంపతులు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అక్టోబర్ 19న ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో   కవిత దంపతులు  శ్రీవారిని దర్శించుకున్నారు. కవిత దంపతులకు దర్శనం చేయించి వేద ఆశ్వీరచనం చేశారు అర్చకులు.  స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు  ఆలయ అధికారులు.

అనంతరం మీడియాతో  మాట్లాడిన కవిత.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. హతీరాం బావాజీ బార్సీ ఉత్సవాల్లో పాల్గొని దర్శనం చేసుకున్నానని తెలిపారు. నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకం అయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరారు.  తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని.. బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు చెప్పారు