గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలి..టీజీపీఎస్సీని ముట్టడించిన జాగృతి నేతలు

గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలి..టీజీపీఎస్సీని ముట్టడించిన జాగృతి నేతలు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్- 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని.. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ జాగృతి నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన గేటు ఎదుట ఆందోళన చేపట్టి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక లోపాలతో గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించిన విషయాన్ని రాష్ట్ర హైకోర్టు ఎత్తి చూపిందన్నారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు అన్యాయం చేసే జీవో నం.29 నుంచి మొదలుకొని ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన, మెయిన్స్ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన అన్నింటా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించిందని వారు ఆరోపించారు. నిరుద్యోగులకు అన్యాయం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు.