హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జూనియర్ బాయ్స్ ఫుట్‌బాల్ జట్టు ప్రతిష్టాత్మక బీసీ రాయ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి విజేతగా నిలిచింది. అస్సాంలోని నగోన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో మణిపూర్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.
తొలుత నిర్ణీత సమయంలో ఇరు జట్లూ 1–1తో సమంగా నిలిచాయి. తెలంగాణ తరఫున సుహేల్ షేక్ గోల్ కొట్టాడు. ఎక్స్‌ట్రా టైమ్‌లో ఇరు జట్లూ గోల్స్ చేయలేకపోయాయి. విన్నర్‌ను తేల్చేందుకు నిర్వహించిన షూటౌట్‌లో తెలంగాణ జట్టు 4–3తో మణిపూర్‌ను ఓడించింది. తెలంగాణ తరఫున యైఫాబ, ఫైజనల్, సాజిద్, ఓమర్ ఫరూక్ గోల్స్ చేశారు. అలోక్ నిషాద్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
