తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: దూది శ్రీకాంత్ రెడ్డి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: దూది శ్రీకాంత్ రెడ్డి

సిద్దిపేట రూరల్, వెలుగు : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సిద్దిపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విమోచన పోరాటాన్ని సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 

ALSO READ:  జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం : కూనంనేని సాంబశివరావు

సెప్టెంబర్ 17న విమోచన దినం జరిపితే ఒక వర్గం వారు బాధపడతారని ఇప్పుడు ప్రభుత్వం సమైక్య దినోత్సవం అని పేర్కొనటాన్ని ఆయన తప్పు పట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పత్రి శ్రీనివాస్ యాదవ్, ఉపేందర్ రావు, కోడూరి నరేశ్, ఉడత మల్లేశం, నర్సింహారెడ్డి, విభీషణ్ రెడ్డి, గోనె మార్కండేయులు, దాబా నరేశ్, కనకరాజు, శ్రీనివాస్, కర్ణాకర్, వెంకట్, యాదవ్ రావు, కృష్ణ, సాయి కిరణ్, భోగి శ్రీనివాస్ పాల్గొన్నారు.