జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం : కూనంనేని సాంబశివరావు

జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం : కూనంనేని సాంబశివరావు
  •     సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు

హనుమకొండ సిటీ, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలను అణచివేసే కుట్ర చేస్తున్నాయని సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌ ఒక్కటేనన్న విమర్శల నుంచి తప్పించుకునేందుకే ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు ఇచ్చారన్నారు. హనుమకొండలోని హరిత హోటల్‌‌లో మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికల పేరుతో బీజేపీ డ్రామా ఆడుతోందని, వచ్చే ఎన్నికల్లో గెలవలేమన్న భయంతోనే జమిలికి తెర లేపారని ఎద్దేవా చేశారు. జమిలి ఎన్నికలు రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.  

సీఎం కేసీఆర్‌‌ ఎంఐఎంకు భయపడే సెప్టెంబర్‌‌ 17ను సమైక్యతా దినంగా ప్రకటించారని, కేసీఆర్‌‌కు ధైర్యం ఉంటే తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవంగా గుర్తించి ఉత్సవాలు అధికారికంగా జరపాలని డిమాండ్‌‌ చేశారు. సాయుధ పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌లు ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

ALSO READ:  వీధి కుక్కల దాడిలో 9 గొర్రెలు మృతి

టి. వెంకట్రాములు, నేదునూరి జ్యోతి, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లా కార్యదర్శులు కర్రె భిక్షపతి, మేకల రవి, తోట మల్లికార్జునరావు, నాయకులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్‌‌ పాల్గొన్నారు.