తెలంగాణలో 24 గంటల్లో 45 కరోనా కేసులు

తెలంగాణలో 24 గంటల్లో 45 కరోనా కేసులు

భారతదేశంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. రెండు వేల కేసులు రికార్డవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ4 తొలి కేసు హైదరాబాద్ లో నమోదయ్యిందని వైద్య శాఖ వెల్లడించింది. దీంతో నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరోవైపు గత 24 గంటల్లో 45 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌‌లో వెల్లడించింది. గురువారం ఈ కేసుల సంఖ్య 47గా ఉందనే సంగతి తెలిసిందే. 24 గంటల్లో 28 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7, 88, 278 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.43 శాతంగా ఉందని, మొత్తం 12 వేల 870 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది.
 

మరిన్ని వార్తల కోసం : -

పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

 

హైదరాబాద్‌‌లో కొత్త రకం ఒమిక్రాన్ కేసు