కరోనా నుంచి కోలుకున్నది 652 మంది

కరోనా నుంచి కోలుకున్నది 652 మంది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు అధికంగా కేసులు రికార్డవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. గత 24 గంటల్లో 851 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. శుక్రవారం ఈ కేసుల సంఖ్య 923గా ఉన్నాయి. 652 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 8, 09, 661 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 98.84 శాతంగా ఉందని, మొత్తం 38 వేల 024 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది. 

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : ఆదిలాబాద్ 09, భద్రాద్రి కొత్తగూడెం 11, హైదరాబాద్ లో 327, జగిత్యాల 02, జనగాం 24, జయశంకర్ భూపాలపల్లి 03, జోగులాంబ గద్వాల 00, కామారెడ్డి 09, కరీంనగర్ 30, ఖమ్మం 22, కొమరంభీం ఆసిఫాబాద్ 11, మహబూబ్ నగర్ 10, మహబూబాబాద్ 16, మంచిర్యాల 20, మెదక్ 06, మేడ్చల్ మల్కాజ్ గిరి 61, ములుగు 01, నాగర్ కర్నూలు 00, నల్గొండ 26, నారాయణపేట 04, నిర్మల్ 00, నిజామాబాద్ 20, పెద్దపల్లి 37, రాజన్న సిరిసిల్ల 08, రంగారెడ్డి 65, సంగారెడ్డి 24, సిద్ధిపేట 32, సూర్యాపేట 11, వికారాబాద్ 00, వనపర్తి 07, వరంగల్ రూరల్ 09, హన్మకొండ 21, యాదాద్రి భువనగరి 25. మొత్తం - 851