అల్కాలంబాతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖా భేటీ

అల్కాలంబాతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖా భేటీ
  • రాష్ట్రంలో బూత్ స్థాయిలో మహిళా కార్యకర్తల శక్తీకరణపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో మహిళా కాంగ్రెస్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు రేఖా బోయలపల్లి అన్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ఇందిరా భవన్‌‌లో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబాతో రేఖా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ విస్తరణ, బూత్ స్థాయి కార్యకర్తల శక్తీకరణ, రాబోయే ఉద్యమాలపై చర్చించారు. 

మహిళల కోసం పోరాడుతున్న అల్కా లంబా నుంచి పలు విషయాలు నేర్చుకున్నట్లు రేఖా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ మహిళా వింగ్ అధ్యక్షురాలిగా ఆమె ఆత్మవిశ్వాసం, ప్రగతిశీల దృక్పథం, మహిళా సాధికారతపై చూపుతున్న నిబద్ధత ఎంతో ప్రేరణ కలిగించాయన్నారు. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి ఆమె మార్గదర్శనం ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు.