సెన్సార్ బోర్డు మెంబర్లుగా హరిప్రియ, వంశీప్రియ

సెన్సార్ బోర్డు మెంబర్లుగా హరిప్రియ, వంశీప్రియ

హైదరాబాద్, వెలుగు:  సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్  మెంబర్లుగా అల్లంశెట్టి హరిత (హరిప్రియ), ఏ.వంశీ ప్రియ అపాయింట్ అయ్యారు.  ఈ నియామకాల్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ చేపట్టింది. వీరిద్దరూ రెండేండ్లపాటు సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ సభ్యులుగా కొనసాగనున్నారు. నియామకానికి సహకరించిన‌‌ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ  బండి సంజయ్ కు  హరిప్రియ, వంశీప్రియ థ్యాంక్స్ చెప్పారు.