
టెస్లా కంపెనీ వ్యవస్థాకులు సీఈఓ ఎలాన్ మస్క్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో టెస్లా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని .. కంపెనీతో కలిసి పని చేయడానికి సంతోషిస్తానని తెలిపారు. దీనికి సంబంధించి కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. భారత్ లో విద్యుత్ కార్లు (టెస్లా) తెచ్చేందుకు సవాళ్లున్నాయని ఎలాన్ మస్క్ చెప్పారు. దీంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో తమ రాష్ట్రం ముందున్నదని గుర్తు చేశారు. భారత దేశంలో వ్యాపారాలకు అనుగుణంగా తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు. గతంలో అమెరికాకు వెళ్లిన కేటీఆర్…టెస్లా కారును నడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను మరోసారి రీ ట్వీట్ చేశారు.
విద్యుత్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని గతేడాది భారత్ ను టెస్లా కోరింది. అయితే..ముందు విద్యుత్ కార్ల ఉత్పత్తిని దేశీయంగా ప్రారంభించాలని భారీ పరిశ్రమల శాఖ టెస్లా కంపెనీకి సూచించింది. ఆ సంస్థ కోరిన రాయితీలు ఇతర వాహన సంస్థలకు ఇవ్వడం లేదని తెలిపింది. ఒకవేళ టెస్లాకు పన్ను మినహాయింపులు ఇస్తే… ఇతర కంపెనీలకు మంచి సంకేతాలు వెళ్లవని అభిప్రాయం వ్యక్తం చేసింది.
Industry & Commerce Minister of Telangana responds to Elon Musk's tweet, inviting him to set shop in India/Telangana
— Economic Times (@EconomicTimes) January 15, 2022
Track latest news updates here https://t.co/OyEMGUfmSB pic.twitter.com/HlW11uhycj
మరిన్ని వార్తల కోసం..