పోలీస్ ఆఫీసర్‎గా ఒలింపిక్ విజేత

V6 Velugu Posted on Jan 15, 2022

ఒలింపియన్ రజత పతక విజేత సాయిఖోమ్ మీరాబాయి చాను.. పోలీస్ ఆఫీసర్‎గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె మణిపూర్ పోలీసు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‎గా బాధ్యతలు స్వీకరించినట్లు మణిపూర్ సీఎం ఎన్. బిరెన్ సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశమిచ్చినందుకు ముఖ్యమంత్రికి మీరాబాయి కృతజ్ఞతలు తెలిపింది.

‘మణిపూర్ పోలీసు విభాగంలో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‎గా చేరడం గౌరవంగా ఉంది. దేశానికి మరియు రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి నాకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రికి  కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని మీరాబాయి ట్వీట్ చేశారు. ఏఎస్పీగా బాధ్యతలు సేకరించి.. సీఎంతో దిగిన ఫోటోలను తన ట్విట్టర్‎లో షేర్ చేసింది.

For More News..

యూపీ ఎన్నికల తొలి లిస్టును ప్రకటించిన బీజేపీ

పాక్ సరిహద్దులో 1400 కిలోల భారత జాతీయ జెండా

పండగపూట గుర్రమెక్కిన బాలయ్య

కోడి పందెంలో ఓడిన కోడి ధర ఎంతో తెలుసా..

Tagged Manipur, Olympic silver medalist, Mirabhai chanu, ASP, CM Biren Singh

Latest Videos

Subscribe Now

More News