
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో గోరఖ్‌పూర్ (అర్బన్) స్థానం నుంచి పోటీ చేయనున్నారు. యూపీ ఎన్నికలకు సంబంధించి 57 మంది కంటెస్టెంట్ల లిస్టును బీజేపీ శనివారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఆ లిస్ట్‌లో సీఎం యోగి.. గోరఖ్‌పూర్ నుంచి పోటీకి దిగుతారని ప్రకటించింది. అదేవిధంగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సిరతు స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గోరఖ్‌పూర్ (అర్బన్) ముఖ్యమంత్రికి కంచుకోటగా ఉంది. యోగి అక్కడినుంచి 2017 వరకు వరుసగా ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తే ఆరవసారి కానుంది.
సీఎం యోగి గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేయడమనేది చాలా చర్చల తర్వాత పార్టీ అగ్ర నాయకత్వం తీసుకున్న తుది నిర్ణయమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం.. ఏ సీటు నుంచి పోటీ చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు యోగి అన్నారని ప్రధాన్ తెలిపారు. గతంలో ఎన్నడూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని ముఖ్యమంత్రి యోగి.. అయోధ్య లేదా మధురలలో ఏదో ఒకదాని నుంచి పోటీ చేస్తారని గతంలో ఊహాగానాలు వచ్చాయి. చివరికి గోరఖ్‌పూర్ కన్ఫమ్ అయింది. యూపీలో ఫిబ్రవరి 10న ప్రారంభమయ్యే ఏడు దశల ఎన్నికల కౌంటింగ్ మార్చి 10న జరగనుంది.
उत्तर प्रदेश विधानसभा चुनाव-2022 के लिए घोषित सभी प्रत्याशियों को हार्दिक बधाई एवं शुभकामनाएं
— BJP Uttar Pradesh (@BJP4UP) January 15, 2022
(1/2)#आएगी_बीजेपी_ही pic.twitter.com/FuluCSmgEr
For More News..