
హైదరాబాద్ సిటీలోని గడ్డి అన్నారంలో ఫ్రూట్ మార్కెట్ మూసేస్తున్న నేపథ్యంలో కొత్తగా బాటసింగారంలో తాత్కాలిక పండ్ల మార్కెట్‌ను దసరా రోజున ప్రారంభిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గడ్డి అన్నారంలో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామని.. అందుకే పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారం తరలిస్తున్నట్లు చెప్పారు. తాత్కాలిక పండ్ల మార్కెట్ కోసం కొత్తపేటలోని విక్టోరియా హోం గ్రౌండ్, బాటసింగారంలోని లాజిస్టిక్ పార్క్ స్థలాన్ని పరిశీలించారు మంత్రులు నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి. కోహెడలో పూర్తిస్థాయిలో మార్కెట్ అందుబాటులోకి వచ్చేందుకు టైం పడుతుందని.. అందుకే తాత్కాలికంగా బాటసింగారం తరలిస్తున్నట్లు చెప్పారు.