లవ్‌ యూ అంకుల్.. మీరు తొందరపడొద్దు

లవ్‌ యూ అంకుల్.. మీరు తొందరపడొద్దు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసి ఓటమిపాలైన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇవాళ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తన్నట్లు ప్రకటించాడు. ఈ విషయంపై ప్రెస్‌ మీట్ పెట్టి ప్రకటన చేసిన ఆయన ఆ తర్వాత కొంత సమయానికి తనపై విజయం సాధించి మా ప్రెసిడెంట్ అయిన హీరో మంచు విష్ణుకు అభినందనలతో పాటు తన రాజీనామా విషయాన్ని మెసేజ్ చేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన విష్ణు.. వారిద్దరి చాట్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి ‘‘భవిష్యత్తు కోసం.. మనమంతా ఎప్పటికీ ఐక్యంగా ఉందాం” అన్న క్యాప్షన్‌తో తన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశాడు.

బయట ఉండి సపోర్ట్ చేస్తా

‘‘డియర్ విష్ణు.. మా ఎన్నికల్లో సాధించిన ఘన విజయానికి నా అభినందనలు.. ‘మా’ను నడిపించే శక్తిని నువ్వు పొందాలని కోరుకుంటున్నా. ఆల్‌ ది బెస్ట్‌” అని ప్రకాశ్ రాజ్ తన మెసేజ్‌లో విష్ణుకు తెలిపాడు. అయితే తాను మా సభ్యత్వానికి రాజీనామా చేయాలనుకున్నంటున్నట్లు కూడా చెప్పాడు. తన నిర్ణయాన్ని ఆమోందించాలని, మాలో సభ్యుడిగా లేకున్నా తాను సపోర్ట్ అందిస్తానని పేర్కొన్నాడు.

అంకుల్.. నేనొచ్చి మీతో మాట్లాడతా!

ప్రకాశ్ రాజ్ మెసేజ్‌కు దాదాపు గంటల సమయం తర్వాత మంచు విష్ణు రిప్లై ఇచ్చాడు. తనకు అభినందనలు చెప్పినందుకు థ్యాంక్ చెప్పాడు. అయితే రాజీనామా చేయాలని ప్రకాశ్ రాజ్ తీసుకున్న నిర్ణయంపై తాను సంతోషంగా లేనని చెప్పాడు. ‘‘మీరు నా కంటే చాలా పెద్దవారు. గెలుపోటములనేవి ఒకే కాయిన్‌కు రెండు ముఖాల్లాంటివని మీకు తెలియనిది కాదు. ఈ రెంటినీ మనం ఒకేలా చూడాలి. ఈ సమయంలో మీరు భావోద్వేగానికి లోనుకావొద్దని కోరుతున్నా. మా కుటుంబంలో మీరూ భాగమే. మనం కలిసి మెలిసి పని చేద్దాం. మీ ఆలోచనలు మాకు అవసరం” అని విష్ణు మెసేజ్ చేశాడు. తన మెసేజ్‌కు వెంటనే రిప్లై కూడా ఇవ్వొద్దని, త్వరలోనే తాను నేరుగా కలుస్తానని అప్పుడు చర్చించకుందామని చెప్పాడు. ‘‘ఐ లవ్‌ యూ అంకుల్‌.. దయ చేసి తొంరపడొద్దు” అని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తల కోసం..

గ్యాస్ సిలిండర్‌‌పై రాష్ట్ర సర్కారు పన్ను రూ.291

స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఈ ఏడాది టెన్త్ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ సర్కారు