హైదరాబాద్ పీవీ నర్సింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై కారు ప్రమాదానికి గురైంది. కారు డ్యామేజ్ కావడంతో అక్కడే ఆగిపోయింది. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వాహనాన్ని పక్కకు తొలగించేందుకు జేసీబీ కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే అదే సమయానికి దేవరకద్ర నియోజకవర్గం పర్యటనలో భాగంగా అటు వైపు వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి తన కాన్వాయ్ ను ఆపి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. కారు రోడ్డుకు అడ్డంగా ఉందని తన సిబ్బందితో పక్కకు నెట్టించి ట్రాఫిక్ క్లియర్ చేయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంత్రి చేసిన పనిని పలువురు నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు చేయాల్సిన పని కదా.. తమకెందుకు అని అనుకోకుండా..ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి ట్రాఫిక్ క్లియర్ చేయడాన్ని అభినందిస్తున్నారు.
