- టోక్యోలో తెలంగాణ నర్సులతో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ
- టామ్‌కామ్ ద్వారా విదేశీ భాషలు నేర్పించి ఉద్యోగాలు కల్పిస్తున్నామని వెల్లడి
- టామ్‌కామ్ ద్వారా విదేశీ భాషలు నేర్పిస్తూ, ఆయా దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: జపాన్‌లో పనిచేస్తున్న తెలంగాణ నర్సులతో శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. టామ్‌కామ్ బృందంతో కలిసి టోక్యో పర్యటనకు వెళ్లిన మంత్రి.. జపాన్‌లో నర్సుల వర్క్ ఎక్స్‌పీరియన్స్, ఉద్యోగ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. రెండేండ్ల కింద టామ్‌కామ్ ద్వారా జపాన్‌కు వెళ్లిన తొలి బ్యాచ్‌కు చెందిన నర్సులు.. తమ పని వాతావరణం, ఉద్యోగంపై ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు.
వారంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం 30 మంది తెలంగాణ నర్సులు జపాన్‌లో పనిచేస్తున్నారని, జపనీస్ భాష నేర్చుకున్న వారికి జపాన్‌లో మరింత భారీగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని వారు చెప్పారు. జపాన్ భాష నేర్చుకున్న నర్సులకు అక్కడ భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం.. జర్మన్, జపాన్ భాషల్లో శిక్షణ అందిస్తూ రాష్ట్ర యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు.
టామ్‌కామ్ ఆధ్వర్యంలో విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు, శిక్షణ పొందిన వారికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అలాగే ఆదివారం హిరోషిమా నగర మేయర్ కజూమీ మత్సుయితో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
