హోంశాఖ మంత్రిగా ఉత్తమ్ : ఆర్థిక మంత్రిగా దుద్దిళ్ల మంత్రుల శాఖలు ఇవే

హోంశాఖ మంత్రిగా ఉత్తమ్ : ఆర్థిక మంత్రిగా దుద్దిళ్ల మంత్రుల శాఖలు ఇవే

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రుల శాఖలపై ప్రజలందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎవరికి ఏ శాఖ కేటాయించనున్నారనే చర్చలు సాగుతున్న వేళ ... రాష్ట్ర ప్రభుత్వం శాఖలను ప్రకటించింది. ఎవరికి ఏ శాఖ ఇవ్వనున్నారో స్పష్టం చేసింది. 

* ఉత్తమ్ కుమార్ రెడ్డి : హోంశాఖ (హుజుర్ నగర్ ఎమ్మెల్యే)

* -కోమటిరెడ్డి వెంకటరెడ్డి :  మునిసిపల్ శాఖ (నల్గొండ ఎమ్మెల్యే )

*దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ (మంథని ఎమ్మెల్యే)

* పొంగులేటి శ్రీనివాస రెడ్డి : -నీటి పారుదల శాఖ (పాలేరు ఎమ్మెల్యే) 

* కొండా సురేఖ : -మహిళా సంక్షేమం శాఖ (వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే)

* మల్లు భట్టివిక్రమార్క : - డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ (మధిర ఎమ్మెల్యే)

* దామోదర రాజనర్సింహ : వైద్య ఆరోగ్యశాఖ (ఆందోల్ ఎమ్మెల్యే)

* జూపల్లి కృష్ణారావు : పౌర సరఫరాల శాఖ (కొల్లాపూర్ ఎమ్మెల్యే )

* సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ ( ములుగు ఎమ్మెల్యే ) 

* తుమ్మల నాగేశ్వరరావు :  -రోడ్లు, భవనాల శాఖ (ఖమ్మం ఎమ్మెల్యే )

ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, మంత్రులతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత సీఎంగా రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు.