ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ లో తెలంగాణ మోడల్ స్కూల్, ఏటీసీ సెంటర్ తో పాటు పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తెలిపారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు పట్టణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హాజరైన బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్సర్కారు చర్యలు చేపట్టిందన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్క పంచాయతీకి రూ.5 లక్షలు మంజూరు చేసేలా ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి నిధులు విడుదలయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక, వైస్ చైర్ పర్సన్ షోయబ్ హుస్సేన్, డీసీసీ ఉపాధ్యక్షుడు రాజురా సత్యం, ఎంపీడీవో రాధ రాథోడ్, తహసీల్దార్ సుజాత రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
