
పలు రాష్ట్రాల్లో తెలంగాణా ఈగల్ టీం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ముంబై, డిల్లీ, రాజస్థాన్, అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్, గోవా ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి నైజీరియా సహా ఇతర దేశాలకు హవాలా ద్వారా నగదు పంపేందుకు సహాకరిస్తున్న 20మందిని అరెస్ట్ చేసింది ఈగల్ టీం. నిందితులు మనీ లాండరింగ్ కు పాల్పడుతూ విదేశాల్లో ఉన్న డ్రగ్ డాన్లకు సహకరిస్తున్నట్లు తేల్చారు. వీరంతా డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును నైజీరియా తరలిస్తున్నట్లు గుర్తించారు. 20 మంది నిందితుల నుంచి ఇప్పటి వరకూ రూ. 3 కోట్ల 84 వేల హవాల డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
హైదరాబాద్ లో డ్రగ్స్ ను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా ముసుగులో పలు కంపెనీల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు చేధించారు. ఇక్కడ డ్రగ్స్ తయారు చేసి పలు రాష్ట్రాలు, దేశాలకు సరఫరా చేస్తున్నట్లు తేల్చారు.
►ALSO READ | కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వండి.. ఫార్ములా ఈ కారు కేసులో ప్రభుత్వానికి ACB రిపోర్ట్
ఆపరేషన్ల సమయంలో వినియోగించే మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్స్ తయారీకి అవసరమైన మెఫెడ్రోన్‌ను డ్రగ్స్ మాఫియాకు విక్రయిస్తున్నారు. ఇక్కడ తయారు చేస్తున్న మెఫెడ్రోన్ డ్రగ్‌ను మెడిసిన్స్ తయారీకి కాకుండా నేషనల్, ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.ముంబై సహా దేశ వ్యాప్తంగా మెఫెడ్రోన్ సప్లయ్ చేస్తున్నారు. డ్రగ్స్ ద్వారా వచ్చిన సొమ్మును హవాలా రూపంలో నైజీరియాకు తరలిస్తున్నారు.