మంత్రాలు చేస్తున్నారని చెట్టుకు కట్టేసిన్రు

మంత్రాలు చేస్తున్నారని చెట్టుకు కట్టేసిన్రు

నర్సాపూర్, వెలుగు :  మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట పాప్యా తండాలో మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో తండావాసులు అదే తండాకు చెందిన నరేశ్,  ఘనపూర్ కు చెందిన భాస్కర్​ను చెట్టుకు కట్టేశారు.

ALSO READ: వైద్య రంగానికి మహర్దశ : ఇంద్రకరణ్​ రెడ్డి

గురువారం అమావాస్య సందర్భంగా పలువురి ఇండ్ల ముందు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వేయడంతో గమనించిన తండావాసులు పట్టుకొని చెట్టుకు కట్టేశారు. సర్పంచ్, పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. విషయం తెలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నరేశ్ , భాస్కర్ లను విడిపించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.