తెలంగాణ నయాగారా: బొగత జలపాతానికి పర్యాటకుల క్యూ..

తెలంగాణ నయాగారా:  బొగత జలపాతానికి పర్యాటకుల క్యూ..

ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతానికి పర్యాటకులు క్యూ కట్టారు. ఆదివారం కావడంతో.. జలపాతం అందాలు చూసేందుకు దూర ప్రాంతాల నుంచి తరలివెళ్తున్నారు. వరద భారీగా ఉండటంతో.. జలపాతం దగ్గరకు పర్యాటకులను అనుమతించడం లేదు. అయినా.. తెలంగాణ నయాగారాగా పిలిచే బొగత వాటర్ ఫాల్స్ ను చూడటానికి పర్యటకులు క్యూ కట్టారు. మూడు నాలుగు రోజులనుంచి పడుతున్న వానలకు రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి .