LSG vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. పంజాబ్ జట్టులో హల్క్

LSG vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. పంజాబ్ జట్టులో హల్క్

ఐపీఎల్ లో అభిమానుల్ని అలరించడానికి ఆదివారం (మే 4) మరో మ్యాచ్ సిద్ధంగా ఉంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఇరు జట్లకు కీలకముగా మారిన ఈ మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఆడిన 10 మ్యాచ్ ల్లో 13 పాయింట్లతో ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు లక్నో ఆడిన 10 మ్యాచ్ ల్లో 5 గెలిచి 6 స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ తుది జట్టులోకి మార్కస్ స్టోయినిస్ వచ్చాడు.  

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): 

ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, ఆకాష్ మహరాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్

Also Read : పరాగ్ విశ్వరూపం.. 5 బంతులకి 5 సిక్సర్లు కొట్టిన రాజస్థాన్ కెప్టెన్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్