ఐటీ మినిస్టర్ గా శ్రీధర్ బాబు.. ఇంకా కేటాయించని శాఖలు ఇవే

ఐటీ మినిస్టర్ గా శ్రీధర్ బాబు.. ఇంకా కేటాయించని శాఖలు ఇవే

తెలంగాణ ఐటీ మినిస్టర్  ఎవరనేది గత కొన్ని రోజులుగా చర్చజరిగింది. గత తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ఐటీ మినిస్టర్ గా  పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తర్వాత ఐటీ మినిస్టర్ గా ఎవరు రాబోతున్నారా అని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. చాలా మంది ఐటీ మినిస్టర్ ఎవరంటూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. అయితే ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి..  దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ శాఖను కేటాయించారు. 

ఇంకా పలు శాఖలను సీఎం ఎవరికి కేటాయించలేదు. హోంమినిస్టర్, విద్యాశాఖ, పశుసంవర్ధక శాఖ, కార్మిక, మున్సిపల్, అర్బన్ డెవ్ లప్ మెంట్, సాధారణ పరిపాలన శాఖలను  సీఎంలో హోల్డ్ లో పెట్టారు. పూర్తి మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఈ శాఖలను కేటాయించే అవకాశం ఉంది. 
 

మంత్రుల శాఖలు

 • భట్టి విక్రమార్క: ఆర్థిక, ఇంధన శాఖ 
 • తుమ్మల నాగేశ్వరరావు: వ్యవసాయ శాఖ 
 • జూపల్లి కృష్ణారావు: ఎక్సైజ్‌ శాఖ 
 • ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి: ఇరేగషన్, పౌరసరఫరాలు 
 • దామోదర రాజనర్సింహ: వైద్య, ఆరోగ్య  
 • కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి: ఆర్‌అండ్‌బీ 
 • దుద్దిళ్ల శ్రీధర్‌బాబు: ఐటీ, అసెంబ్లీ వ్యవహారాలు 
 • పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి: రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ 
 • పొన్నం ప్రభాకర్‌: రవాణా, బీసీ సంక్షేమ శాఖ 
 •  సీతక్క: పంచాయతీరాజ్‌, మహిళ, శిశు సంక్షేమ శాఖ
 • కొండాసురేఖ: అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ