ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా ఫీజ్ చెల్లింపుకు తత్కాల్ స్కీం

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా ఫీజ్ చెల్లింపుకు తత్కాల్ స్కీం

హైదరాబాద్: ఓపెన్ ఎస్సెస్సీ, ఇంట‌ర్ ప‌రీక్షా ఫీజు చెల్లించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్‌) శ‌నివారం త‌త్కాల్ స్కీంను ప్ర‌క‌టించింది. 2021-22 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ కోర్సులో ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు, అంతకుముందు ఫెయిల్ అయిన అభ్యర్థులు, పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులైనప్పటికీ పరీక్ష రుసుం సకాలంలో చెల్లించలేని అభ్యర్థులు ఇప్పుడు మే 1 నుంచి 7 వరకు చెల్లించవచ్చు. త‌త్కాల్ స్కీం కింద‌ సాధార‌ణ ఫీజుకు అద‌నంగా ఎస్సెస్సీకి రూ. 500, ఇంట‌ర్మీడియెట్‌కు రూ. వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సంబంధిత స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్‌ను సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తల కోసం...

ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్ గా జనరల్ మనోజ్ పాండే

చిన్నదొరకు తెలంగాణలో దోస్తులు లేరా?