తెలంగాణ‌కు రూ.947 కోట్ల బ‌కాయిలు

తెలంగాణ‌కు రూ.947 కోట్ల బ‌కాయిలు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ‌కు రూ.947.90 కోట్ల ఉపాధి హామీ వేత‌న బ‌కాయిలు, రూ.262.71 కోట్ల మెటీరియ‌ల్ బ‌కాయిలు ఉన్నాయ‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి క‌మ‌లేశ్ పాశ్వాన్ తెలిపారు. మంగళవారం లోక్‌స‌భ‌లో వివిధ పార్టీల ఎంపీలు అడిగిన ప్రశ్నల‌కు కేంద్ర మంత్రి రాత‌పూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణ‌లో ఉపాధి హామీలో అవ‌క‌త‌వ‌క‌లకు సంబంధించి మొత్తం 1,17,626 కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలిపారు. సోష‌ల్ ఆడిట్ చేసి రూ.5,24,81,645 రిక‌వ‌రీ చేయాల‌ని నిర్ణయించినట్లు సమాధానంలో పేర్కొన్నారు. అందులో ఇప్పటికే రూ.5,24,81,645 రిక‌వ‌రీ చేసిన‌ట్లు వెల్లడించారు.