తెలంగాణ ప్రజలు BJPనే కోరుకుంటున్నారు : డీకే అరుణ

తెలంగాణ ప్రజలు BJPనే కోరుకుంటున్నారు : డీకే అరుణ

యాదాద్రి భువనగిరి: తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆ పార్టీ నేత డీకే అరుణ అన్నారు. శనివారం చౌటుప్పల్‌ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశ కార్యక్రమానికి డీకే అరుణ, రఘునందన్‌రావు, గంగిడి మనోహర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడారు.

తెలంగాణ ప్రజలు బీజేపీనే కోరుకుంటున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని తెలిపారు. వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరనున్నారని చెప్పారు అరుణ.