- జట్టు జెర్సీని ఆవిష్కరించిన జయేష్ రంజన్
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ పికిల్‌బాల్ అసోసియేషన్ (ఐపీఏ) నేషనల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జట్టును తెలంగాణ పికిల్‌బాల్ అసోసియేషన్ (టీపీఏ) ప్రకటించింది. మొత్తం 46 మంది సభ్యులతో కూడిన బలమైన టీమ్‌ను ఎంపిక చేసింది. ఈ నేషనల్ ఈవెంట్‌లో పోటీ పడే ఇదే అతిపెద్ద స్టేట్ టీమ్ కావడం విశేషం.
ఈ సందర్భంగా తెలంగాణ జట్టు అధికారిక జెర్సీని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ టీమ్‌కు టెన్నిస్ ఒలింపియన్, ఆసియా గేమ్స్ మెడలిస్ట్, టీపీఏ సెక్రటరీ విష్ణు వర్దన్ నాయకత్వం వహిస్తున్నాడు. స్టేట్ నం.1 ప్లేయర్ సమీర్ వర్మ జట్టుకు మెంటార్‌గా, సీనియర్ ప్లేయర్ శ్రీకర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
