హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) కన్నుమూశారు. నవంబర్ 10 తెల్లవారుజామున ఒక్కసారి తన ఇంట్లో అందెశ్రీ కుప్పకూలారు. దీంతో వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు అందెశ్రీని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నవంబర్ 10 ఉదయం 7: 25గంటలకు తుదిశ్వాస విడిచారని డాక్టర్లు తెలిపారు. అందెశ్రీ మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో 1961లో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ”ను రచించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. అశు కవిత్వంలో దిట్ట. “పల్లెనీకు వందానాలమ్మో”, “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు” పాటలు ప్రసిద్ధం.
