పోలీస్ సెలక్షన్స్‌ లో ట్యాంపరింగ్

పోలీస్ సెలక్షన్స్‌ లో ట్యాంపరింగ్

పోలీస్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డ్ ద్వారా జరుగుతున్న పోలీస్ సెలక్షన్స్‌ లో ట్యాంపరింగ్ జరిగింది. కొండాపూర్ బెటాలియన్‌ లో జరిగిన ఈవెంట్స్ ట్యాంపరింగ్ చేస్తున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ ఈవెంట్స్ కోసం రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ థర్డ్ పార్టీ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు ఈ–సాఫ్ట్ కన్సల్టెన్సీ ని వెండర్‌‌‌‌‌‌‌‌గా నియమించింది. ఈ సంస్థ ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్స్ లో 5 విభాగాలను కంప్యూటరైజ్‌ చేస్తోంది. రాష్ట్రంలో అన్ని బెటాలియన్లతో పాటు కొండాపూర్‌‌‌‌‌‌‌‌ జరుగుతున్న ఈవెంట్స్ లో కూడా అభ్యర్థుల డేటాను లోకల్ సర్వర్ లో ఫీడ్ చేసింది. ఇందులో కన్సల్టెన్సీకి చెందిన బానోతు నాగు.. ఈవెంట్స్ లో పాల్గొన్న అభ్యర్థుల డేటాను ట్యాంపర్ చేసి సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ చేశాడు. అందుకు భూక్యా రమేశ్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తిని మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకున్నాడు.

ఈ ఇద్దరూ కలిసి ఈవెం ట్స్ లో పాల్గొనే అభ్యర్థుల డిజిటల్ స్కోర్‌‌‌‌‌‌‌‌ను ట్యాంపర్‌‌‌‌‌‌‌‌ చేశారు. లోకల్ సర్వర్‌‌‌‌‌‌‌‌లో ఫీడ్ అయ్యే స్కోర్ ను నాగు రిమోట్ తో ఆపరేట్ చేశాడు. ఇలా కొం డాపూర్ బెటాలి యన్‌‌‌‌‌‌‌‌కు అలాట్ అయిన జంగ శామ్యూల్, ముతమల్ల కిరణ్ కుమార్ లను 800 మీటర్స్ లో క్వాలి ఫై అయ్యేలా లోకల్ సర్వర్ ను ట్యాంపర్ చేశాడు. వీరితోపాటు అంబర్ పేట్ సీపీఎల్ లో జరిగిన ఈవెం ట్స్ లో గాదే జగద్గిరిని మరో ఈవెంట్ లో రిమోట్ తో ట్యాం పర్‌‌‌‌‌‌‌‌ చేసి క్వాలి ఫై అయ్యేలా చేశాడు. ఇందుకు ఈ ముగ్గు రి వద్ద రూ.2 లక్షలు వసూలు చేశారు.

అనుమానం రావడంతో వెలుగులోకి..

కొం డాపూర్ బెటాలి యన్ లో లోకల్ సర్వర్ లో ఫీడ్ ఐన అభ్యర్ థుల డేటాపై పోలీస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డు అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ నెల 15న క్రాస్‌‌‌‌‌‌‌‌ చెక్ చేశారు. అభ్యర్థుల డేటా ట్యాంపర్ అయినట్లు గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 19న నిందితులు నాగు, రమేశ్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేశారు. ఇద్దరి వద్ద రూ.2 లక్షలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌ కు తరలించారు.