
దేశంలోనే నెంబర్‌వన్ పోలీసుగా గుర్తింపు పొందిన తెలంగాణ పోలీసులు టెక్నాలజీ వినియోగంలో విప్లవాత్మకమైన చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు డ్రోన్ కెమెరాలను పోలీసులు సిద్ధం చేశారు. మంత్రి కేటీఆర్ సూచనల ప్రకారం పోలీసు యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కమాండ్ కంట్రోల్ ప్రారంభ సందర్భంగా ఐ డ్రోన్ కెమెరా, 100 నెంబర్ సర్వీస్‌ను మొదలు పెడదామని డీజీపీని కేటీఆర్ కోరారు. మహిళలకు రక్షణ కోసం టెక్నాలజీని వాడుకోవాలని కేటీఆర్ తెలిపారు. దీంతో పోలీసులు డ్రోన్ కెమేరాలను సిద్ధం చేశారు.