కరోనా పేషంట్లకు ఫ్రీ ఫుడ్ అందిస్తున్న తెలంగాణ పోలీసులు

కరోనా పేషంట్లకు ఫ్రీ ఫుడ్ అందిస్తున్న తెలంగాణ పోలీసులు

అల్వాల్: కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం అందించేందుకు గానూ రాష్త్ర పోలీసు శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సేవ్ ఆహార్ పేరుతో ఇవ్వాళ్టి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా బారిన పడిన వారికి ఇంటికే భోజనం పంపుతామని పోలీస్ శాఖ చెప్తోంది. వివిధ స్వచ్చంద సంస్థలతోపాటు స్విగ్గీ, జొమాటో సంస్థల భాగస్వామ్యంతో పౌష్ఠిక ఆహారాన్ని ఇంటికే పంపిస్తామని అడిషనల్ డీజీ స్వాతి లక్రా తెలిపారు. 

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాణాజి గూడ, శోభా గార్డెన్స్ లో కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం కార్యక్రమాన్ని స్వాత్రి లక్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజుకు రెండు వేల మంది బాధిత కుటుంబాలకు ఫ్రీ ఫుడ్ డెలివరీ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఫ్రీ ఫుడ్ కోసం వాట్సప్ నంబర్ ఏర్పాటు చేశామని, సిటీలో ఎక్కడికైనా భోజనం సప్లయ్ చేస్తామన్నారు. ఆహారం అవసరం ఉన్న వారు 7799616163కు వాట్సప్ చేయాలని సూచించారు.