రీల్స్ చేసే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.75వేలు గెలుచుకునే అవకాశం

రీల్స్ చేసే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.75వేలు గెలుచుకునే అవకాశం

డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసుల వినూత్న కార్యక్రమం చేపట్టనున్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాలు మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని(జూన్ 26) పురస్కరించుకొని షార్ట్ వీడియో కాంటెస్ట్ కండక్ట్ చేయనున్నారు. ఈ మేరకు ‘డ్రగ్స్ అండ్ ఇట్స్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ’ పేరుతో ఈ పోటీ నిర్వహించనున్నారు. 18 ఏళ్ల వయస్సు పైబడిన వారు ఇందులో పాల్గొనవచ్చు. 

'డ్రగ్స్ వాడకం సమాజంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుంది.. దాని వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు, ఆ వ్యక్తుల కుటుంబసభ్యులు పడే బాధలను కళ్ళకు కట్టినట్లు చూపించాలి. ఆ దృశ్యాలను గరిష్టంగా మూడు నిమిషాల వ్యవధిలో రూపొందించాల్సి ఉంటుంది. ఆ వీడియోలను జూన్ 20, 2023లోపు సమర్పించాలి.ఈ పోటీలో గెలిచిన విజేతలకు నిలిచిన పురస్కారాలు అందజేయబడతాయి. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. 75,000, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 50,000 మరియు ముడా స్థానంలో నిలిచిన వారికి రూ. 30,000 నిలిచిన బహుమతి అందిస్తారు. ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వారు మరింత సమాచారం కోసం 96523 94751 నంబర్‌లో నిర్వాహకులను సంప్రదించవచ్చు.