15, 644 పోస్టులు.. 9 లక్షల 54 వేల మంది అభ్యర్థులు

15, 644 పోస్టులు.. 9 లక్షల 54 వేల మంది అభ్యర్థులు

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎగ్జామ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 16వందల సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. 15 వేల 644 పోస్టులకు గాను.. 9 లక్షల 54వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు ఎగ్జామ్ సెంటర్ పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీలను మూసివేయించారు. కామారెడ్డి జిల్లాలో 29 కేంద్రాలలో 11,042 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు సూచించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 173 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ కు 71,923 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 

గంట ముందు నుంచే పరీక్ష సెంటర్ లోకి అనుమతినిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో  పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు 6, 909 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరునుండగా.. 8.45 గంటలకే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతినిచ్చారు. కరీంనగర్ లో కానిస్టేబుల్ రాత పరీక్ష కోసం 55 సెంటర్లు ఏర్పాటు చేశారు. 26 వేల 80 మంది పరీక్ష రాస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 8,703 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకు గాను జిల్లాలో 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.