చప్పట్లు కొట్టి.. పూలు చల్లి

చప్పట్లు కొట్టి.. పూలు చల్లి

హైదరాబాద్, వెలుగు: ఎన్​కౌంటర్​ విషయం తెలుసుకున్న జనం ఉదయమే చటాన్​పల్లి బ్రిడ్జికి భారీగా తరలివచ్చారు. ‘సీపీ సజ్జనార్​ జిందాబాద్​.. తెలంగాణ పోలీస్​ జిందాబాద్’​ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బ్రిడ్జి కింద పోలీసులు విచారణ సాగిస్తుండగా పైనుంచి పూలు చల్లారు. చప్పట్లతో హర్షం ప్రకటించారు. ఇదే జనం.. ఆరురోజుల క్రితం షాద్​నగర్​ పోలీస్​స్టేషన్​లో నిందితులు ఉన్నట్లు తెలుసుకొని స్టేషన్​ను ముట్టడించారు.

విచారణలో పోలీసుల తీరును నిరసిస్తూ.. వెంటనే నిందితులను చంపేయాలని డిమాండ్​ చేస్తూ భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. నిందితులను చర్లపల్లికి తరలిస్తుండగా పోలీసులపై రాళ్లు, చెప్పలు విసిరారు. ఇప్పుడు ఆ నలుగురు నిందితులను ఎన్​కౌంటర్​ చేయడంతో హర్షం ప్రకటించారు. పూల వర్షం కురిపించారు.