పాలిసెట్లో 18,984 మందికి సీట్లు

పాలిసెట్లో 18,984 మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ అయింది. మొత్తం 65.5% మందికి సీట్లు కేటాయించారు. పాలిసెట్ ఎగ్జామ్ లో 80,949 మంది క్వాలిఫై కాగా, 20,811 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 18,984 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 59 సర్కారు పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా, 13,964 సీట్లు ఉంటే 11,455 (82%) సీట్లు నిండాయి. 56 ప్రైవేటు కాలేజీలు ఉండగా, 15,032 సీట్లు ఉంటే 7,529 (50.1%) సీట్లు అలాట్ అయ్యాయి.

 మొత్తం 10,012 సీట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు. కాగా, ఐదు గవర్నమెంట్ కాలేజీలు, ఒక ప్రైవేటు కాలేజీలో వందశాతం సీట్లు నిండాయి. ఈ నెల 18లోగా ఫీజు చెల్లించి, ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలను https://tgpolycet.nic.in వెబ్ సైట్​ను సందర్శించాలని కోరారు.