మహబూబాబాద్/ జనగామ అర్బన్/ కాశీబుగ్గ/ భీమదేవరపల్లి/ ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మహబూబాబాద్కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలపై 146 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆఫీసర్లు ప్రభుత్వ వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించాలని, కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జనగామ కలెక్టరేట్లో అర్జీదారుల నుంచి 207 వినతులు స్వీకరించినట్లుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
వరంగల్ కలెక్టరేట్లో 127 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ సత్యశారద పేర్కొన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో భీమదేవరపల్లి మండల పరిధిలోని రంగయ్యపల్లి జీపీ పరిధిలో ఉన్న కరీంబాద్ను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని స్థానికులు కలెక్టర్ చాహత్బాజ్పాయ్కి వినతి పత్రం అందజేశారు. ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
గిరిజన దర్బార్‌కు ఫిర్యాదుల వెల్లువ
ఏటూరునాగారం : గిరిజనుల సమస్యల పరిష్కారానికి ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలో కలెక్టర్, ఇన్చార్జి పీవో దివాకర ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనదర్బార్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐటీడీఏలో కలెక్టర్ గిరిజన దర్బార్ కు సంబంధించి 130, ప్రజావాణికి గిరిజనేతరుల నుంచి 52 అర్జీలు మొత్తం 182 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు.
