కరోనా పై పోరుకు మేము సైతం అంటున్న ఖైదీలు

కరోనా పై పోరుకు మేము సైతం అంటున్న ఖైదీలు

హైదరాబాద్: కరోనా పై పోరుకు ఖైదీలు మేము సైతం అంటూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు అవసరమైన మాస్క్ లు, శానిటైజర్స్ ను తయారు చేస్తున్నారు. రాష్ట్రంలోని చర్లపల్లి, చంచల్ గూడ సహా అన్ని జిల్లా జైళ్లలో ఖైదీలంతా మాస్క్ లు, శానిటైజర్స్ తయారీలో నిమగ్నమయ్యారు. డిమాండ్ ఎక్కువ ఉండటంతో మాస్క్ లు, శానిటైజర్స్ కు కొరత ఏర్పడింది. కొంతమంది అడ్డగోలు రేట్లకు వీటిని అమ్ముతున్నారు. దీంతో జైళ్ల శాఖ అధికారులు ఖైదీలతో మాస్క్ లు, శానిటైజర్స్ ను తయారు చేయించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఖైదీలకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. చర్లపల్లి జైళ్లో ఖైదీలు రెండు షిప్ట్ లు పనిచేస్తూ వీటిని తయారు చేస్తుండటం విశేషం. ఖైదీలు చేసిన మాస్క్ లు, శానిటైజర్స్ ను మై నేషన్ అనే బ్రాండ్ ద్వారా తక్కువ ధరకే మార్కెట్లో సేల్ చేస్తామని అధికారులు తెలిపారు. మాస్క్ లు, శానిటైజర్స్ చేయాలని మాకు ఆదేశాలు రాలేదు. మార్కెట్లో కొరత కారణంగా మేమే చొరవ తీసుకొని ఖైదీలతో తయారు చేయిస్తున్నాం అని ఓ అధికారి చెప్పారు. రోజు తెలంగాణ జైళ్లలోని ఖైదీలు 9000 మాస్క్ లు, 3000 లీటర్ల శానిటైజర్స్ ను తయారు చేస్తున్నారని అధికారులు చెప్పారు.