రేపటి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్

రేపటి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్
  • నిలిపివేస్తామన్న నెట్​వర్క్​ ఆస్పత్రులు
  • రూ. 1500 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల బకాయిలు విడుదల చేయకపోతే శుక్రవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల నిర్వాహకులు ప్రకటించారు. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. ప్రైవేటు ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. అనివార్య పరిస్థితుల్లో మరో మార్గం లేక ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు ఆసుపత్రుల యాజమాన్యం సమష్టిగా నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని బుధవారం తెలిపారు.