తెలంగాణ జీఎస్టీ వసూళ్లలో 12 శాతం వృద్ధి

తెలంగాణ జీఎస్టీ వసూళ్లలో 12 శాతం వృద్ధి
  • కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో గత ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లలో 12 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే సమయానికి రూ.4,569 కోట్ల వసూళ్లు కాగా.. ఈ ఏడాది రూ.5,103 కోట్లు వసూలయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ వసూళ్ల గణాంకాలను విడుదల చేసింది. వరుసగా 8వ నెల సుస్థిర వృద్ధిని కనబరుస్తూ.. 6.5 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలిపింది.

 గతేడాది ఆగస్టులో మొత్తం రూ.1.74 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి సమకూరగా.. ఈ ఏడాది రూ.1.86 లక్షల కోట్లకు వసూళ్లు చేరుకున్నట్లు తెలిపింది. అలాగే, గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్- – ఆగస్టులో రూ.9.13 లక్షల కోట్లుగా జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.10 లక్షల కోట్లతో 9.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.