హైదరాబాద్, వెలుగు: గీత కార్మికులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేస్తున్న టాడీ టాపర్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. రెండో త్రైమాసికం కింద రూ.17 కోట్లు విడుదల చేస్తూ బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయ దేవి సోమవారం జీవో జారీ చేశారు.
రాష్ర్ట వ్యాప్తంగా గీత కార్మికులకు ఇస్తున్న కాటమయ్య కిట్ల పంపిణీకి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. అయితే, ఇప్పటి వరకు రాష్ర్ట వ్యాప్తంగా గీత కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చి సుమారు 4,500 వేల కిట్లను టాడీ టాపర్స్ కార్పొరేషన్ అందజేసింది.
