ఫ్యూచర్ సిటీ టౌన్ ప్లానింగ్ జేడీగా స్నేహమాల ..తెలంగాణ సర్కారు ఉత్తర్వులు

ఫ్యూచర్ సిటీ టౌన్ ప్లానింగ్ జేడీగా స్నేహమాల ..తెలంగాణ సర్కారు ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) మాస్టర్ ప్లాన్ పనుల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టౌన్ ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా స్నేహమాలను తిరిగి అదే స్థానంలో  కొనసాగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం ఉత్తర్వులిచ్చారు.

 ఈ ఏడాది ఆగస్టు 23న జరిగిన బదిలీల్లో భాగంగా స్నేహమాలను రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ (రెరా) అథారిటీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ పూర్తయ్యే వరకు ఆమె సేవలు ఎంతో అవసరమని పేర్కొంటూ ఆ శాఖ కమిషనర్ అక్టోబర్ 5న ప్రభుత్వానికి లేఖ రాశారు. కమిషనర్ అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం, గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను సవరిస్తూ ఆమెను ఫ్యూచర్ సిటీలోనే రిటైన్ (కొనసాగింపు) చేస్తూ నిర్ణయం తీసుకుంది.