'తెలంగాణ రైజింగ్–2047'కు విశేష స్పందన.. రాష్ట్ర భవిష్యత్తుకు రూపకల్పన

'తెలంగాణ రైజింగ్–2047'కు విశేష స్పందన.. రాష్ట్ర భవిష్యత్తుకు రూపకల్పన

వికారాబాద్​, వెలుగు: రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకు ఉద్దేశించిన ‘తెలంగాణ  రైజింగ్  – 2047’ సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వికారాబాద్​ జిల్లా కలెక్టర్​ ప్రతీక్​ జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వేలో వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని విలువైన సమాచారాన్ని అందజేశారని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టిందని చెప్పారు. గత వారం ప్రారంభించిన సర్వే ఈ నెల 25న ముగుస్తుందని, ఇందులో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.