180 వాహనాలు సీజ్.. మరో 245 పైగా వెహికల్స్పై కేసులు

180 వాహనాలు సీజ్.. మరో 245 పైగా వెహికల్స్పై కేసులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ​వాహనాలు తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తం గా 245 పైగా వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.

 అలాగే  180 వాహనాలను సీజ్ చేసినట్టు రవాణా శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. అందులో 40 ఓవర్ లోడ్ తిరిగే వాహనాలున్నాయని, మిగిలిన వాహనాలకు ఫిట్ నెస్, టాక్స్, పర్మిట్ తదితర పత్రాలు లేవని తెలిపారు.