
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఈ తెల్లవారుజామున(శుక్రవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు పండర్‌పూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదానికి గురైంది. షోలాపూర్-పుణె జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి
బస్సులో ప్రయాణిస్తున్న వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సోలాపూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తేల్చారు.