కుషాయిగూడ టు సోమశిల, గోవా...పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రత్యేక బస్సులు

కుషాయిగూడ టు సోమశిల, గోవా...పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రత్యేక బస్సులు

మల్కాజిగిరి, వెలుగు: ఆర్టీసీ కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు  ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డీఎం వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 4న సోమశిల, 11న గోవా యాత్ర ఉంటుందన్నారు. 

సోమశిల, సింగోటం, శ్రీరంగాపూర్, బీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి , గోవా, కుక్కే సుబ్రహ్మణ్య, ధర్మస్థల, ఉడిపి, గోకర్ణ, మురుడేశ్వర్ తదితరాల దర్శనం కల్పిస్తామన్నారు.  సోమశిల యాత్ర టికెట్ ధర రూ.1,200, గోవా యాత్రకు రూ.5 వేలని తెలిపారు. భోజనం, వసతి ఖర్చులను ప్రయాణికులే భరించాలని, రిజర్వేషన్ కోసం 96035 49388  నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో సంప్రదించాలని సూచించారు.