జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు బంద్ .. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ నిర్ణయం

జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు బంద్ ..    ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ నిర్ణయం
  • జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు బంద్​ 
  • ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ నిర్ణయం

తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ఆర్టీసీ యాజమాన్యం నిలిపివేసింది. ఈ బస్సుల్లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సు సర్వీసుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.


హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ఆర్టీసీ యాజమాన్యం నిలిపివేసింది. ఈ బస్సుల్లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సు సర్వీసుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్రంలో మొత్తం వెయ్యి వరకు ఈ బస్సులు ఉండగా, సిటీ బయట వివిధ డిపోల్లో సుమారు 500 సర్వీసులు తిరుగుతున్నాయి. జేబీఎం కంపెనీ బస్సులు కాకుండా, ఇతర కంపెనీ ఎలక్ట్రిక్ బస్సుల భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని, ఆ బస్సులు యథావిధిగా నడుస్తాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. జేబీఎం సంస్థ చైనా నుంచి బ్యాటరీ నిపుణులను రప్పించి విచారణ జరిపించిన తర్వాతే.. తుది నివేదిక ఆధారంగా ఈ బస్సులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.